చిరుమర్తి లింగయ్య. నకిరేకల్ ఎమ్మెల్యే. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. ఈయనేమో వేముల వీరేశం. మాజీ ఎమ్మెల్యే. టీఆర్ఎస్ నేత. గత ఎన్నికల్లో లింగయ్య చేతిలో ఓడిపోయారు వీరేశం. ఇక ఈయన కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్లగొండ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. ముగ్గురూ ముగ్గురే. ఈ ముగ్గురి చుట్టూనే ప్రస్తుతం నకిరేకల్ టీఆర్ఎస్ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. లింగయ్య పేరు చెబితేనే వీరేశం.. భూపాల్‌రెడ్డిలు ఒంటికాలిపై లేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ను వీడి కారెక్కినప్పటి నుంచి వీరేశం,…