బీఆర్కే భవన్ లో సీఈఓని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కలిశారు. ఈ నెల 27 వ తేదీ నల్గొండ -ఖమ్మం -వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వర్కింగ్ డే రోజు జరుగుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటింగ్ ఉన్నవారికి పోలింగ్ రోజు వేతనం తో కూడిన సెలువు ప్రకటించాలని వెంకట్ కోరారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సీఎం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో 33 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర…