నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా నాగం వర్షిత్ రెడ్డి నియామకం కమల దళంలో కల్లోలం రేపుతోందట. నియామకం తర్వాత రేగిన అసమ్మతి జ్వాలల్ని ఆర్పేందుకు అధిష్టానం ఎంతగా ప్రయత్నిస్తున్నా... తిరిగి ఎక్కడో ఒక చోట రేగుతూనే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వర్షిత్ రెడ్డి మొదటి నుండి క్యాడర్‌ను కలుపుకుని పోవడం లేదని, ఏకపక్ష నిర్ణయాలతో చేటు చేస్తున్నారన్నది ఆయన వ్యతిరేకుల ప్రధాన ఆరోపణ.