నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా నైపుణ్యం పోర్టల్ ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ఏపీ మంత్రి నారా లోకేష్.. సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్యం పోర్టల్ ని ప్రారంభిస్తున్నాం.. యువత - పరిశ్రమలను అనుసంధానించేలా నైపుణ్యం పోర్టల్ పని చేస్తుందని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.