Arjun Bijlani: బాలీవుడ్ నటుడు అర్జున్ బిజ్లానీ అనారోగ్యం పాలయ్యాడు. తాను తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. "తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాను. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేయనున్నారు. ఏది జరిగినా మన మంచికే" అంటూ హాస్పిటల్ బెడ్ పై సెలైన్ తో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు.