Arjun Bijlani: బాలీవుడ్ నటుడు అర్జున్ బిజ్లానీ అనారోగ్యం పాలయ్యాడు. తాను తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. “తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాను. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేయనున్నారు. ఏది జరిగినా మన మంచికే” అంటూ హాస్పిటల్ బెడ్ పై సెలైన్ తో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ఇక అర్జున్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో నాగిని సీరియల్ ఎంత పేరు తెచ్చుకుందో అందరికి తెల్సిందే. మూడు సీజన్స్ గా ఈ సీరియల్ తెలుగువారిని అలరిస్తుంది.
ఇక నాగిని మొదటి పార్ట్ లో హీరోయిన్ మౌని రాయ్ జతకట్టింది అర్జున్ తోనే. ఈ సీరియల్ తోనే అర్జున్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సీరియల్ తీసుకొచ్చిన గుర్తింపుతో ఇండియా గాట్ టాలెంట్ అనే షోకు యాంకర్‌గా వ్యవహరించాడు. వీటితో పాటు రెండు వెబ్‌సిరీస్‌లు, పలు షార్ట్ ఫిల్మ్స్‌లతో అలరించాడు. తాజాగా అలియాభట్, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇక అర్జున్ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.