Satyadev: రెండేళ్ళ క్రితం ఆగస్ట్ మాసంలో సెట్స్ పైకి వెళ్ళింది 'గుర్తుందా శీతాకాలం' చిత్రం. కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్' ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన ఈ మూవీలో సత్యదేవ్ సరసన తమన్నా నాయికగా నటించింది. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి, సుహాసిని తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నాగశేఖర్ దర్శకత్వంలో భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్మెస్ రెడ్డి, చిన్నబాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు