నాగార్జున సాగర్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ కు కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన కేసీఆర్ రాబోతున్నారని ఆయన విమర్శించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ను చూస్తే కేసీఆర్ నుంచి అనేక దుర్మార్గులు నేర్చుకోవచ్చని, చనిపోయిన కుటుంబాలకే ఏకగ్రీవంగా చేసే సంప్రదాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కి ఎన్నికలకు తేరలేపాడని అన్నారు. ఎమ్మెల్యేలు కృష్ణా రెడ్డి ,రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి లు చనిపోతే ఏకగ్రీవం కాకుండా …ఎలక్షన్ లను కలెక్షన్ లుగా మార్చి సెలక్షన్ చేయడం కేసీఆర్ నాంది పలికాడని అన్నారు.
మరీ ఇదే నాగార్జున సాగర్ లోఎందుకు నోముల భగత్ కోసం సానుభూతి ఓట్లను అడుగుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు లో ఉన్నపుడు నోముల నర్సింహయ్య గారు అన్ని రంగాల కార్మికుల సమస్యలను అసెంబ్లీ లోగళం వినిపించారని, 2014 లో నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యే గా నోముల నర్సింహయ్య ఓడిపోతే ఎందుకు పదవి ఇవ్వలేదు ? అని ప్రశ్నించారు. నోముల నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా గెలిచాక ఏనడైనా సీఎం వచ్చిండా అని ప్రశ్నించారు. నోముల నర్సింహయ్య బ్రతికి ఉండగా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు ? అలుగడ్డలు టమాటోలు అమ్మేవాళ్లకు మంత్రి పదవి ఇచ్చాడని అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉన్న అర్హతలు నోముల నర్సింహయ్య లేవా ? నోముల నర్సింహయ్య చనిపోతే …వెంటనే కుటుంబానికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు ? అని అయన ప్రశ్నించారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎంసీ కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి ఇవ్వాలా వద్దా ఆలోచించి…చివరికి నోముల భగత్ ఇచ్చారు…ఇది నోముల కుటుంబానికి అవమానం కాదా అని ఆయన అన్నారు. ఓడిపోయే టికెట్ నోముల కుటుంబానికి ఇచ్చాడని, జానారెడ్డి విజయం ఖాయం కనుకే నోముల భగత్‌కు టికెట్ ఇచ్చాడని అన్నారు. బలహీన వర్గాలు అంటే కేసీఆర్ కు లెక్కలేదన్న ఆయన రేపటి సిఎం కేసీఆర్ సభ కరోనా నిబంధనల ఉల్లంఘన ,ఎన్నిక ల నిబంధనలు ఉల్లంఘన తో ఉందని అన్నారు. రైతుల ఇష్టం, అనుమతి లేకుండానే పొలాల్లో సభ ఏర్పాటు చేశారు అని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం జానారెడ్డిని కలవలేదా ? అని ప్రశ్నించారు.