ప్రస్తుతం తెలంగాణ మొత్తం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వైపు చూస్తుంది. అయితే ఈ ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన రాజకీయ పార్టీలు అని జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే నాగార్జున సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సిపిఐ మద్దతు తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. అందులో ”నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం పార్టీలు టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నోముల భగత్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. రెండు పార్టీల నిర్ణయం మేరకు ఈ నెల 17వ తేదీన జరిగే ఎన్నికల్లో సిపిఐ శ్రేణులు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు గా ఓట్లు వేసి గెపించాల ని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం పిలుపునిచ్చారు” అని పేర్కొంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ సీఎం కేసీఆర్ ఈ నెల 14న ఓ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.