చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీలో మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి… ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటగా.. ఎంపీపీ ఎన్నికల విషయంలో.. స్థానిక ఎమ్మెల్యే రోజాకు సెగ తగిలింది.. నిండ్ర మండలం.. ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా నిర్ణయించిన అభ్యర్థికి స్థానిక నేతలు చక్రపాణిరెడ్డితో పాటు అతడి తమ్ముడు కూడా మద్దతు ఇవ్వలేదు.. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్యే రోజా.. స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఇలా చేయడం సరికాదన్నారు.…
తనకు నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. గతంలో తనకు అవకాశాలు వచ్చినా.. పార్టీ సేవకు అంకితం అయ్యాయని గుర్తుచేసుకున్నారు.. నాకు రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చినా వదులుకున్నానని.. పార్టీ సేవకే అంకితం అయ్యా.. అజీజ్ పాషాకు అవకాశం ఇచ్చామని తెలిపారు.. ఇక, తాను ఎక్కడ పోటీచేసినా పార్టీ అవసరాల కోసమే చేశానని.. కానీ, ఏ ఎన్నికల్లోనూ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు నారాయణ.. తాను 50…
CPI నారాయణ స్టయిలే వేరు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో.. ఎవరి మీద విరుచుకుపడతారో ఎవరికీ అర్థం కాదు. అలాంటి నారాయణకు ఒక్కటే కోరిక మిగిలిపోయిందట. ఇప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారి మాత్రం గట్టిప్లాన్‌తో వర్కవుట్ చేయాలని అనుకుంటున్నారట ఆ కామ్రేడ్. అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయాలని కలలు! సీపీఐ నారాయణ ఏం చేసినా సంచలనమే. ఆయన చేసిన పనులు క్షణాల్లో వైరల్ అవుతాయి. తాజా రాజకీయ పరిణామాలపై స్పందిస్తు మెయిన్ స్ట్రీమ్‌లో…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉద్యమం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత కూడా అదే విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల నేతలు జల వివాదంపై పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. వాటాల విషయంలో వివాదం రోజురోజుకు పెరిగిపోతున్నది. జలవివాదంపై నగరి ఎమ్మెల్యే రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రెండురాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, కేంద్రం…