KCR: నేడు నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో రూ.53 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయాలతో పాటు దేశిఇటిక్యాల శివారులో నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ జిల్లాకేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ ఏర్పాట్లపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు.
తనకు పడక సుఖాన్ని ఇవ్వలేదని భార్యను అతి దారుణంగా భర్త హత్య చేసిన ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. ఒక నెల బాలింత అయిన భార్యను తన కోరిక తీర్చాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కనికరం లేకుండా గొంతునులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.. పోస్టుమార్టం రిపోర్ట్ తో అసలు విషయం బయటపడింది.. వివరాల్లోకి వెళితే..నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారుకొండ ప్రాంతం అగ్రహారం తండాకు చెందిన జటావత్ తరుణ్, ఝాన్సీ ప్రేమించుకుని 2021లో పెద్దల అంగీకారంతో పెళ్లి…
Jupally Krishna Rao : నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులతో కలిసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన నిర్వహించారు. వరి కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించాలని జూపల్లి కృష్ణారావు కోరారు.
ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్, కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా నగర పరిసరాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం పూట పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రభుత్వాలు ఎన్ని అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను తీసుకువచ్చినా వన్యప్రాణులను వేటగాళ్ల భారీ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వేటగాళ్లు మాత్రం తమ దారిలోనే అధికారుల కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణపై తీసుకునే రక్షణ చర్యలపై ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరముందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే వేటగాళ్ల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు చివరి దశకు చేరుకున్నాయి. ఉన్న కొన్నింటినైనా కాపాడుకుని భవిష్యత్ తరాలకు వాటిని…