చంద్రబాబు తెలుగు ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్.. ఈ ప్రాంతం కోసం చంద్రబాబు చేసిన కృషిని ఎవ్వరూ మరిచిపోకూడదు.. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగింది.. పవన్ వస్తానంటే విమానం ఎక్కడానికి కూడా అనుమతి లభించని పరిస్థితి.. ఫ్లైట్ ఆపేయడం ఏంటంటూ ఆశ్చర్యపోయామని నాదేండ్ల మనోహార్ అన్నారు.
పవన్ కల్యాణ్ వస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారని నాదెండ్ల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీసులో భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం సీనియర్ నాయకులతో సమావేశం నిమిత్తం రానున్నారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుండి 3,82,000 మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు. విద్యార్థుల అంశంలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని.. దీనికి కారణాలు ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ప్రధానమైనదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా.. మంచి నిర్ణయాలను, కార్యక్రమాలను సమర్ధిస్తామన్నారు. కానీ ప్రజాస్వామ్య విరుద్దంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తే ప్రశ్నించకుండా ఎలా ఉంటామన్నారు.
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు జనసేన మద్దతిస్తోంది అని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై పవన్ కళ్యాణ్ తో కేంద్ర పెద్దలు చర్చించారు.
సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కేడర్ కు సూచించారు. భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు చేయాలని, రెల్లి కాలనీల్లో పవన్ బర్త్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. breaking news, latest news, telugu news, big news, nadendla manohar, pawan kalyan, PSPK Birthday, janasena