Assam looking to ban polygaymy: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, మతమార్పిడులు, బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపుతున్న ఆయన ఇప్పుడు ‘‘బహుభార్యత్వం’’ నిషేధించాని చూస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో బహుభార్యత్వంపై నిషేధించడం విధించడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. న్యాయపరమైన అంశాలను అన్వేషించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.