ఈద్-ఉల్-అఝా(బక్రీద్) పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, అంకితభావం, అల్లాహ్‌పై అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈద్-ఉల్-అఝా పండుగ మనం కలిసి జీవించడానికి, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
మహారాష్ట్ర ఎస్పీ అధ్యక్షుడు అబూ అజ్మీ.. మొఘల్ చక్రవరి ఔరంగజేబ్ గొప్ప పాలకుడని, క్రూరుడు కాదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వివాదం ముదరడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందువల్ల ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
Ramzan Mubarak: రంజాన్ పవిత్ర మాసం భారతదేశంలో ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసాలు (రోజాలు) ప్రారంభించారు. శనివారం సాయంత్రం రంజాన్ మాసం చందమామ దర్శనమిచ్చిన తర్వాత ప్రజలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ తన ఎక్స్ (పాత ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ లో ” పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మన సమాజంలో శాంతి,…
Sanjauli Mosque: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో గల సంజౌలీ మసీదు మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. మసీదులోకి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత ప్రవేశించిన తర్వాత ఈ అంశంపై మళ్లీ తీవ్ర దుమారం చెలరేగింది.
మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్డర్ 7 రూల్ 11పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం పక్షం దఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.
భాగ్యనగరంలోని ముస్లిం సంఘాలు బంద్ కు పిలుపునిచ్చారు. పాతబస్తీలో మసీదు, కమిటీలు, మత పెద్దలతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తమకు నిరసనలు తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ముందస్తుగా పాతబస్తీలో భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రంగంలోకి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దిగింది. చార్మినార్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గత శుక్రవారం ప్రార్థనలు చేసిన…