కేసీఆర్ ముచ్చట.. అక్బర్ బీర్బల్ కథలా వుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వంకాయ కూర బాగుందంటే బాగుందని భజన బ్యాచ్ అంటున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే ఆయన భజన మండలి ఆహా హోహో అంటున్నారని విమర్శించారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని విమర్శించారు. మొదటి నుండి బీజేపీకి మద్దతిచ్చిన పార్టీ టీఆర్‌ఎస్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. జీఎస్టీ నుండి అన్ని అంశాల్లో కేసీఆర్ అండగా నిలిచారని…