ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు మెనియా నడుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. మునుగోడులో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎవరు పిలిచినా పిలవకున్న మునుగోడు ప్రచారానికి వెళ్తా..నా తరపున కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేస్తా. నా దగ్గర ఉన్న మెడిసిన్ త్వరలోనే బయటికి తీస్తా. వెంకట్ రెడ్డిని అధిష్టానం పిలిచి బుజ్జగిస్తే గెలుపు కోసం పని చేస్తాడు.
కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు హోమ్ గార్డులు కాదు, ఐపీఎస్ లు కాదు. మేమంత సైనికులం..అధిష్టానం మాకు బాస్. బండి సంజయ్ కోతల రాయుడు. దుబ్బాకలో ఈ సారి బిజెపి గెలవదు. ఈటల కూడా హుజురాబాద్ లో ఒడిపోతానన్న భయంతో గజ్వెల్ నుంచి పోటీచేస్తా అని చెబుతున్నాడు. ఈటలకి ఓటమి భయం పట్టుకుంది. ప్రియాంక గాంధీ మాకు ఇంచార్జ్ గా వస్తే నేను హ్యాపీ. రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి వ్యవహారాలపై నో కామెంట్స్ అని ఆయన వ్యాఖ్యానించారు.