Tension in Mahbubabad: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో నివసిస్తున్న పేదల ఇండ్లను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇవాళ ఉదయం తొలగించారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి కూల్చివేత పై హైకోర్టు స్టే విధించింది. అయ్యన్న ఇంటి కూల్చివేత పై ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. అర్థరాత్రి వాదనలు ముగిశాయి.జలవనరుల శాఖ గతంలో అనుమతి ఇచ్చినప్పటికీ ఎటువంటి నోటీసు లేకుండా ఇల్లు కూల్చివేస్తున్నారని వాదనలు వినిపించారు. దీంతో వాదనలు విన్న అనంతరం హైకోర్ట్ అయ్యన్న ఇంటి దగ్గర కూల్చివేతపై స్టే…
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పురపాలికలు మేయర్లు,చైర్పర్సన్, కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాలు, పల్లెల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో…