ఏపీలోని 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. కమలాపురం మునిసిపాలిటీలోని 20 వార్డుల్లో 15 వైసీపీ, 5 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. 01, 06, 12, 13, 19 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. Also Read:బద్దలైన చంద్రబాబు కంచుకోట.. కుప్పంలో వైసీపీ దూకుడు.. 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 14,15,…
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎస్ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ సంద ర్భంగా వారు వైసీపీ పై ధ్వజమెత్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. ఇప్పటికే పలు ఎన్నికల్లో అధి కార దుర్వినియోగాని పాల్పడుతున్నారని వారు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. కొండపల్లి, కుప్పం, నెల్లూరుల్లో ఎన్నికల ప్రచారంలో వార్డు వలంటీర్లు పాల్గొంటున్నారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చిన టీడీపీ నేతలు. వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారంటూ…
గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో అధికార పార్టీ నేతల తీరును తప్పు పడుతూ కోర్టుకు వెళ్లారు అభ్యర్ధులు. ఎన్నికల తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా టెలికాస్ట్ చేయాలని, టీడీపీ అభ్యర్థులు, ఓటర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టులో టీడీపీ అభ్యర్థులు పిటిషన్ వేశారు. టీడీపీ అభ్యర్థులు, పోలింగ్ బూత్, ఓటర్లకు పోలీసులతో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసారు. ఎన్నికల తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు…
ఏపీలో ఎన్నికల వాతావరణం మళ్ళీ వేడెక్కింది. గతంలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. తొలిసారి బేతంచర్లకు మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ప్రారంభమయింది. రెండో రోజునామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. వివిధ పార్టీల నేతలు భారీ బందోబస్తు మధ్య నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ ఛైర్మెన్ అభ్యర్థిగా బి. ప్రసన్న లక్ష్మీ…
తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలకు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీని తెరాస పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 27 వార్డులు ఉండగా, 19 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో 16 వార్డులను తెరాస పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటె రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కూడా తెరాస పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డులు ఉండగా అందులో ఏడు వార్డుల్లో తెరాస…
సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 43 వార్డు లకు బరిలో ఉన్న 236 మంది అభ్యర్థులు ఉండగా రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కి 15 టేబుల్స్ ఏర్పాటు చేయగా, ఒక్కో టేబుల్ కి మూడు వార్డ్ లు చొప్పున ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఒక్కో టేబుల్ కి ఒక సూపర్ వైజర్, ఇద్దరు సిబ్బంది ఉంటారు. ఇక ఈ మున్సిపల్…
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు, సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 11,34,032 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోబోతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక…
రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు ఆరువేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే, ఈనెల 30 వ తేదీన రాష్ట్రంలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈరోజు మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి, సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆమె కోరారు. కరోనా…
తెలంగాణలో బీజేపీకి మరో పరీక్ష ఎదురు కానుందా? అర్బన్ ప్రాంతాల్లో తమకు పట్టు ఉన్నట్టు చెప్పుకొనే కమలనాథులకు మినీ పురపోరు.. పెను సవాలేనా? ఆయా మున్సిపాలిటీలలో బీజేపీకి ఉన్న బలమేంటి.. బలహీనతలేంటి? లెట్స్ వాచ్! 2023కు ముందు జరిగే పెద్ద ఎన్నికలు మినీ పురపోరేనా? తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికలకు తెరలేచింది. ఒకవైపు నాగార్జునసాగర్ ఉపఎన్నిక కాకమీద ఉన్న సమయంలోనే రెండు మున్సిపల్ కార్పొరేషన్లు.. ఐదు మున్సిపాలిటీలలో ఎలక్షన్స్కు షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 30నే…
గ్రామాల విలీనం పూర్తయింది. డివిజన్ల ముసాయిదా విడుదలైంది. అధికార, విపక్ష పార్టీలలో ఆధిపత్యపోరుకు మాత్రం చెక్ పడలేదు. వరసగా నాలుగోసారి పాగా వేయాలని ఒక పార్టీ.. తొలిసారి జెండాను రెపరెపలాడించాలని మరొకపార్టీ కలలు కంటున్నా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు భిన్నంగా ఉన్నాయట. రాజమండ్రి వైసీపీ, టీడీపీ నేతల్లో ఐక్యత లేదా? గోదావరి తీరంలోని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడెక్కుతోంది. విలీన గ్రామాల సమస్య కోర్టులో ఉండటంతో మొన్న ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ముసాయిదా విడుదల కావడంతో స్పీడ్…