Telangana Municipal Elections: నేడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరగనుంది. అయితే.. నేడే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా.. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఓవైపు అధికార యంత్రాంగం సిద్ధమవుతుండగా.. మరోవైపు పొలిటికల్ హీట్ కూడా పెరిగిపోతోంది.