ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. విద్యా శాఖలోకి మున్సిపల్ స్కూళ్ల విలీనం ప్రభుత్వ కుట్ర అని మండిపడ్డారు. ఏపీలో 2,115 పురపాలక పాఠశాలలకు చెందిన వేల కోట్ల ఆస్తుల కోసమే విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ తన స్వార్థం కోసం నాలుగున్నర లక్షల విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడతారా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విలీన…