BMC Election Results: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ముంబై రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మొత్తం 227 వార్డుల ఫలితాలు ప్రకటించగా, దాదాపు 25 ఏళ్లుగా ఠాక్రే కుటుంబానికి కంచుకోటగా ఉన్న BMCలో ఈసారి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ–షిండే శివసేన కూటమి కలిసి మొత్తం 118 సీట్లు గెలుచుకుంది. అధికారానికి అవసరమైన మెజారిటీ 114 సీట్లు కాగా, కూటమి ఆ సంఖ్యను నాలుగు సీట్ల తేడాతో…
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీని సాధించి, తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ముఖ్యంగా మూడు దశాబ్దాలుగా శివసేన (UBT) కంచుకోటగా ఉన్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లో బీజేపీ సాధించిన విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గెలుపు కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాకుండా, మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసిన సంఘటనగా నిలిచిపోయింది.…
Annamalai: బీజేపీ నేత కే.అన్నామలై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేపై తీవ్రంగా స్పందించారు. ఠాక్రేల బెదిరింపులు తనను ముంబై రాకుండా అడ్డుకోలేవని సోమవారం అన్నారు. ఇటీవల, ముంబైలో శివసేన-ఎఎన్ఎస్ ర్యాలీలో అన్నామలైని ఎగతాళి చేస్తూ ఠాక్రేలు బెదిరించే వ్యాఖ్యలు చేశారు.
Devendra Fadnavis: “బుర్ఖా ధరించిన ముస్లిం” ముంబై మేయర్ పీఠాన్ని చేపట్టవచ్చని ఎంఐఎం నేత వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల మౌనాన్ని సీఎం దేవేంద్ర పడ్నవీస్ ప్రశ్నించారు. మరాఠీ హిందువే తదుపరి ముంబై మేయర్ అవుతారని ఆయన అన్నారు. బీజేపీకి దేశమే మొదటి ప్రాధాన్యత అని, బీజేపీ మరాఠీ, మరాఠీయేతర ఓటర్లనున విభజించడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలను తిప్పికొట్టారు. ముంబై మేయర్ పదవి మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడిందా.? అని ఓ కార్యక్రమంలో ప్రశ్నించగా.. అవును అంటూ…
BJP Leader: అమెరికా న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయం సాధించారు. న్యూయార్క్‌కు కాబోతున్న మొదటి ముస్లిం మేయర్‌గా మమ్దానీ చరిత్ర సృష్టించారు. దీని తర్వాత, ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ మేము ఏ ఖాన్‌ను ముంబై మేయర్‌గా అనుమతించం’’ అని అన్నారు. ఓట్ జిహాద్ ద్వారా న్యూ్యార్క్ నగరంలో కనిపించే విధంగా ముంబైకి రాజకీయాలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు.