ముంబై ఇండియన్స్ జట్టులోని కీలకమైన ఆటగాళ్ళలో కీరన్ పొలార్డ్ ఒకడు. ఎన్నోసార్లు జట్టు ఆపదలో ఉన్నప్పుడు నెట్టుకురావడమే కాదు, కొన్నిసార్లు ఒంటిచేత్తో జట్టుని గెలిపించిన ఘనత అతని సొంతం. అవసరమైనప్పుడల్లా బ్యాట్‌కి పని చెప్పడమే కాదు, బంతితోనూ మాయ చేయగలడు. అంతటి ప్రతిభావంతుడు కాబట్టే, యాజమాన్యం రూ. 6 కోట్లు వెచ్చించి మరీ అతడ్ని రిటైన్ చేసుకుంది. ఎప్పట్లాగే ఈసారి కూడా మెరుపులు మెరిపిస్తాడని అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా ఇతను పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తూ వస్తున్నాడు.…