MI vs SRH: కష్టాల్లో సన్‌రైజర్స్.. 10 ఓవర్లలో పరిస్థితి ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunrisers Hyderabad Scored 76 Runs In First 10 Overs Against MI: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అతికష్టం మీద లక్ష్యం దిశగా సాగుతోంది. తొలి 10 ఓవర్లలో ఈ జట్టు 4 వికెట్ల నష్టానికి కేవలం 76 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో ఇంకా 117 పరుగులు చేయాల్సి ఉంటుంది. మొదటి నుంచి ముంబై ఇండియన్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటంతో.. సన్‌రైజర్స్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేకపోతున్నారు. దీనికితోడు అనవసరమైన షాట్ల జోలికి వెళ్లి, వికెట్లు సమర్పించుకుంటున్నారు. మొదట్లోనే హైదరాబాద్ జట్టుకి హ్యారీ బ్రూక్ వికెట్ రూపంలో భారీ ఝలక్ తగిలింది. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అతగాడు.. ఈసారి కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడి, భారీ ఛేజింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాడని అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా అతగాడు కేవలం 9 వ్యక్తిగత పరుగులకే పెవిలియన్ చేరాడు.
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల.. మే 2న సుప్రీంకోర్టు విచారణ
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!

ఇక ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అతడు కూడా 7 పరుగులే చేసి, పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం మార్ర్కమ్ వచ్చాక హైదరాబాద్ జట్టులో కాస్త జోష్ వచ్చింది. భారీ ఇన్నింగ్స్ ఆడలేదు కానీ, ఉన్నంతసేపు హైదరాబాద్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేశాడు. ఇక క్రీజులో కుదురుకున్నాడని ఆలోచించేలోపే.. అతడు కూడా ఔటయ్యాడు. మొదట్లో హ్యారీతో కలిసి ఓపెనింగ్ చేసిన మయాంక్ అగర్వాల్ ఒక్కడే, ఆచితూచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నాడు కూడా! అయితే.. హైదరాబాద్ లక్ష్యానికి చాలా దూరంలో ఉంది. దాన్ని ఛేజ్ చేయాలంటే.. భారీ షాట్లతో చెలరేగి ఆడాలి. కానీ.. ఆ స్థాయి ఆటగాళ్లు ఇప్పుడు కరువయ్యారు. మరి.. ఉన్న ఆటగాళ్లు ఎలా లాక్కొస్తారో చూడాలి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?