GT vs MI: ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Won By 55 Runs On Mumbai Indians: గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో గుజరాత్ 55 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముంబైలోని ప్రధాన బ్యాటర్లందరూ ఘోరంగా విఫలం అవ్వడంతో, ఆ జట్టు ఇంత చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కొంతలో కొంత నేహాల్ వాధేరా (40), గ్రీన్ (33) పర్వాలేదనిపించారంతే. మిగతా వాళ్లు ఘోర ప్రదర్శనతో తీవ్ర నిరాశపరిచారు. సూర్యకుమార్ యాదవ్ పలు షాట్లతో ఊరించాడు కానీ, ఆ తర్వాత ఉసూరుమనిపించాడు.

Also Read
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (56) అర్థశతకంతో చెలరేగగా.. డేవిడ్ మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో రాహుల్ తెవాతియా కేమియో కూడా అదిరింది. అతడు కేవలం 5 బంతుల్లోనే మూడు సిక్సర్ల సహాయంతో 20 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు సైతం తమవంతు సహకారం అందించడంతో.. గుజరాత్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. ఆది నుంచే చెత్త ప్రదర్శన కనబర్చింది. పవర్ ప్లేలో దుమ్మరేపుతారని అనుకున్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్.. టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి బంతులు వృధా చేశారు. రోహిత్ 8 బంతులు ఆడి 2 పరుగులే చేస్తే.. ఇషాన్ కిషన్ 21 బంతులు ఆడి 13 పరుగులే చేశాడు. టాపార్డర్‌లో కెమెరాన్ గ్రీన్ (33) ఒక్కడే అప్పుడప్పుడు మంచి షాట్లు ఆడుతూ.. జట్టుని ముందుకు నడిపించాడు.
Joe Biden: 2024 ఎన్నికల్లోనూ పోటీ చేస్తా.. జో బైడెన్ ప్రకటన
ఇక గ్రీన్ కుదురుకున్నాడని, ఈరోజు భారీ ఇన్నింగ్స్ చూడబోతున్నామని అనుకునేలోపే అతడు ఔటయ్యాడు. ఈసారి యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా రెండు పరుగులకే చేతులెత్తేశాడు. టిమ్ డేవిడ్ అయితే.. ఇలా వచ్చి, అలా వెళ్లిపోయాడంతే! అప్పుడు క్రీజులో ఉన్న సూర్య, నేహాల్ కాస్త మెరుపులు మెరిపించడం చూసి.. బహుశా వీళ్లు గట్టిగా ప్రయత్నిస్తారేమోనని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే సూర్య ఔట్ అవ్వడంతో ఆశలన్నీ బోల్తా పడ్డాయి. నేహాల్ (40) ఉన్నంతసేపు కాస్త మెరుపులు మెరిపించాడు. ఇక మిగతా బ్యాటర్లు సోసోగా రాణించి.. ఆలౌట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు.
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!