Vande Bharat Express Train Repaired Within 24 Hours: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు గురువారం ప్రమాదానికి గురైంది. ముంబై-గాంధీ నగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో అహ్మదాబాద్ కు సమీపంలో ఉదయం 11.15 గంటలకు గేదెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రైన్ ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్ కోచ్ కు ముక్కు భాగంలో ఉండే మౌంటు బ్రాకెట్ ల కవర్ దెబ్బతింది. రైలుకు సంబంధించి ఇతర భాగాలేమి దెబ్బతినలేదు.