Off The Record: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌ను ఓ కుదుపు కుదిపేస్తున్న నకిలీ మద్యం ఎపిసోడ్ ఇప్పుడు కూటమిలో కూడా కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. దాని గురించి ఆ స్థాయి రచ్చ అవుతున్నా… వైసీపీ ఒంటికాలి మీద లేస్తూ టార్గెట్ చేస్తున్నా… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదన్న డౌట్స్ వస్తున్నాయట కూటమి సర్కిల్స్‌లో. అంటే నకిలీ మద్యం వ్యవహారాన్ని కేవలం టీడీపీ సమస్యగానే డిప్యూటీ సీఎం చూస్తున్నారా?…
Adulterated Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు లిక్కర్ స్కామ్ కేసు.. మరోవైపు.. నకిలీ లిక్కర్ కేసులు కాక రేపుతున్నాయి.. అయితే, అన్నమయ్య జిల్లా మొలకలచెరువు నకిలీ మద్యం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో 10 మంది నిందితులను మూడురోజుల కస్టడీ కి అనుమతి ఇచ్చింది తంబళ్లపల్లె కోర్టు.. అయితే, నకిలీ లిక్కర్ స్కామ్ కేసులో 10 మంది నిందితులను ఏడు రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది ఎక్సైజ్ శాఖ.. దీనిపై…
కల్తీ మద్యం తయారీ విషయంలో ఇంటి దొంగల పాత్ర గుర్తించడంపై ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి మునకలచెరువు సీఐ హిమ బిందుపై వేటు వేసింది. ఇప్పుడు కేసులకు కీలక నిందితుడు జనార్దన్ బార్, అదే విధంగా కల్తీ మద్యం తయారీ డంప్ బయటపడిన పరిధిలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న గోపాలకృష్ణ తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు అని సమాచారం. సీఐ పరిధిలో జనార్ధన్, అతని అనుచరుడు కళ్యాణ్ స్థానిక శ్రీనివాస వైన్స్‌లో…
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం కదిరినాథుని కోట పంచాయతీ మొలకలచెరువు సమీపంలో 16వ శతాబ్దంలో కనుగొండ రాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. వర్షం కారణంగా రిగ్గులో నాట్లు పేలక పోవడంతో రిగ్గులకు ఏర్పాటు చేసిన వైర్లు కాలిపోయాయి. గుర్తులు ఆలయ గోడపై కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఆలయాన్ని కూల్చేయాలని ఉద్దేశంతో సుత్తి, గడ్డపార ఇతర పరికరాలతో గోడను కింది భాగం తొలగించారు.