Kashibugga Stampede: మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం తొక్కిసలాట ఘటన స్థలానికి వెళ్లారు. ఈసందర్భంగా ఆయన ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ.. కాశిబుగ్గలో వెంకటేశ్వర దేవస్థానం వద్ద జరిగిన ప్రమాదం అందరి మనసులను కలిచివేసిందని అన్నారు. ఈ సంఘటన చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. అమాయకులైన 9 మంది మహిళలు, 11 ఏళ్ల బాలుడు మృతి…
ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ముస్తాబవుతుంది. రేపు ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా సీతా రామ చంద్రస్వామి వారికి.. ఈరోజు సాయంత్రం గోదావరిలో హంస వాహన సేవ కొనసాగనుంది. సాయంత్రం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా గోదావరి నదికి చేరుకుంటాయి. గోదావరి నదిలో ఏర్పాటు చేసిన హంస వాహనంపై స్వామివారి వేంచేసి.. గోదావరిలో విహరించుతారు.
Vaikunta Ekadashi : హిందూ సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిలలో, వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. ఇది తెలుగు రాష్ట్రాల్లో పిలువబడుతుంది, ఇది మోక్షదా ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశితో కలిసి వచ్చే అత్యంత పవిత్రమైన సందర్భం. ఇది డిసెంబర్ , జనవరి మధ్య వచ్చే ధను మాసంలో గమనించబడుతుంది. పద్మ పురాణంలో వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి ప్రస్తావించబడింది. ఒక పురాణం ప్రకారం, విష్ణువు ఒక రాక్షసుడిని చంపడానికి యోగమాయ దేవి సహాయం తీసుకున్నాడు.…
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైకుంట ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ భక్తులు విచ్చేశారు. రాజకీయ, సీని ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 1.45 గంటలకే స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. అయితే 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణలో సైతం ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంది. వేకువజామునుంచే స్వామి…