మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి ఏడాది అయింది. ఆమె పార్టీ అవామీ లీగ్, స్టూడెంట్స్ లీగ్‌లను బంగ్లాలో నిషేధించారు. అయినప్పటికీ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ మనస్సులో షేక్ హసీనా భయం తొలగిపోయినట్లు కనిపించడం లేదు. మొహమ్మద్ యూనస్ మరోసారి షేక్ హసీనా పార్టీపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు అవామీ లీగ్ దేశంలో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.
Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వచ్చిన మహ్మద్ యూనస్ పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రెండు దేశాలు భారత్ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. తాజాగా, బంగ్లా-పాక్‌లు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దౌత్య, అధికారిక పాస్‌పోర్టులు కలిగిన వ్యక్తుల వీసా రహిత ప్రవేశానికి అంగీకరించాయి.
Bangladesh: గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ ఉద్యోగ కోటాలో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రధాని షేక్ హసీనా దిగిపోవాలని ఉద్యమించారు. అయితే, ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. చివరకు ఈ అల్లర్లు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది.
ప్రధాని మోడీ గురించి బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అడిగితే మోడీ అంగీకరించలేదని తెలిపారు.
Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అక్కడి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గత సంవత్సరం బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుండి షేక్ హసినా తొలగించబడిన అనంతరం దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత నెలకొంది. అప్పటి నుండి ఆమె పరారీలో ఉన్నారు. ఈ పరిణామాల…
Bangladesh: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ నేతృత్వంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దావా(జేయూడీ) నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దిగడానికి కారణమైన సామూహిక తిరుగుబాటు, హింసాత్మక ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని జేయూడీ నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తానని తెలిపిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం తన పౌరులకు ఒక సలహా జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం, విదేశీయులను వివాహం చేసుకోవడానికి సంబంధిత చట్టాలను ఖచ్చితంగా పాటించాలని చైనా పౌరులకు సూచించింది. Also Read:PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. టాప్-2 టార్గెట్!…
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా, తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్‌పై విరుచుకుపడ్డారు. ఆయన బంగ్లాదేశ్‌ని అమెరికాకు అమ్మేస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని సైన్యం పిలుపునిచ్చిన తర్వాత, తాను రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ‘‘రఖైన్ కారిడార్’’ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ప్రాంతం నుంచి మయన్మార్ రఖైన్ రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత ఈ కారిడార్‌ని ‘‘రక్తపాత కారిడార్’’ అంటూ ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ మాత్రం తన అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఎన్నికలు లేకుండా మరో 5 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు…
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పని చేయలేనని.. ఈ మేరకు ఆయన భయాన్ని వ్యక్తం చేసినట్లు నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ నిద్ ఇస్లాం అన్నారు.