Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆ దేశంలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిందో, అప్పటి నుంచి ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్స్ చెలరేగిపోతున్నారు. యూనస్ ప్రభుత్వం జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల్ని, అరాచకవాదుల్ని విడుదల చేసింది.
Bangladesh: ఒకప్పుడు దాయాది దేశం పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఉన్న బంగ్లాదేశ్(అప్పటి తూర్పు పాకిస్తాన్) ఏ లక్ష్యం కోసం స్వాతంత్య్రాన్ని తెచ్చుకుందో ఇప్పుడు ఆ లక్ష్యం మరుగునపడిపోతోంది. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ జిన్నా, బెంగాలీ మాట్లాడే ప్రజలపై ఉర్దూ భాషను రద్దాలని చూడటమే బంగ్లాదేశ్ ఏర్పాటుకు మూలమైంది. అయితే, ఇప్పుడు షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ రాడికల్ ఇస్లామిస్టుల రాజ్యం నడుస్తోంది. జమాతే ఇస్లామీ వంటి మతఛాందస వాద సంస్థలకు కొత్త ప్రభుత్వం క్లీన్…