రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా వివరాలను ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా మీడియాకు వెల్లడించారు. కేసు ఇంకా విచారణ దశలో ఉందని.. బాలిక మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. ముచ్చుమర్రిలో 7వ తేదీన బాలిక మిస్ అయిందని.. ఫిర్యాదు అందిన వెంటనే బాలిక కోసం వెతికామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. విజయనగరంలో మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడని.. ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లోకి తోసేశారని ఆమె తెలిపారు.