కరువుతో అల్లాడుతోంది రాయలసీమ. కరువు సీమలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోసం కడపకు కూత వేటు దూరంలోని కొప్పర్తిలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశాయి గత ప్రభుత్వాలు. భారీ పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగ సమస్య తీరుతుంది అని ఆశల పల్లకిలో ఊరేగుతున్న నిరుద్యోగ యువతకు ఎన్డీఏ ప్రభుత్వం చేదువార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పరిశ్రమను విజయవాడలో ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రభుత్వం నివేదికలు పంపిందట.. రాష్ట్ర రాజధాని అమరావతిలో దాదాపు…