ఇవాళ్టి నుంచి మృగశిర కార్తె ప్రారంభమైంది. కృత్తిక, రోహిణి కార్తెల్లో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఇక మృగశిర కార్తె అనగానే చేపలు గుర్తొస్తాయి. మృగశిర కార్తె నాడు చేపలు తినడం ఆనవాయితీగ మన పూర్వీకుల కాలం నుంచే వస్తోంది. మృగశిర కార్తె ఇవాల్టి నుంచి మొదలై 15 రోజుల పాటు ఉంటుంది. ఐతే మృగశిర కార్తె తొలి…