రాజ్యసభ ఎంపీలపై ఆసక్తికరమైన ఏడీఆర్ నివేదిక వెలువడింది. రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల్లో (Rajya Sabha MPs) 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్నట్లు ఎన్నికల హక్కుల సంఘం ఏడీఆర్(ADR) నివేదిక తెలిపింది.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సీట్లకు మూడు నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాగా.. రేపు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రేణుకా చౌదరి తీసుకోనున్నారు. మరోవైపు.. అనిల్ కుమార్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయనికి పలువురు ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఐదవ జాబితా కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కట్టారు. సీఎంఓకు వచ్చిన వారిలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్, సుచరిత, అన్నాబత్తుని శివ కుమార్, రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామి రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మంత్రి జోగి రమేష్…
LIC MCap : ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్‌ఐసీ షేర్లలో గత కొన్ని రోజులుగా అద్భుతమైన ర్యాలీ కనిపిస్తోంది. నేడు, మార్కెట్‌లో ఆల్ రౌండ్ విక్రయాలు కనిపిస్తున్నప్పటికీ.. ఎల్‌ఐసి వాటా మాత్రం గ్రీన్ జోన్ లోనే కొనసాగుతోంది.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. ఎంపీలు పార్లమెంట్‌కు హాజరు కావాలని, పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ విప్ జారీ చేసింది.
మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 9 మంది ఎంపీలు ఉన్నారు.
Distribution of Sheep: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొల్ల, కురుమలకు 2వ దశ సబ్సిడీ గొర్రెల పంపిణీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది.