ఏపీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు.ఇతరులకి సహాయపడటమే నిజమైన పండుగ అని ఆయన అన్నారు. మాటకోసం పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజలకోసం పనిచేసే…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి… బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి సదరు ఎంపీపై బెదిరింపులకు దిగాడు.. దీంతో.. తుళ్లూరు పోలీసులను ఆశ్రయించిన ఎంపీ పీఏ… ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.. ఇక, రంగంలోకి దిగిన తుల్లూరు పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా కూలిలాగడంతో.. ఫోన్ చేసిన వ్యక్తి బాబూరావుగా గుర్తించారు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాబూరావును అదుపులోకి తీసుకుని…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. సీఎస్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపించింది. పీఎంవోకు ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది. Read Also: రెండు దశాబ్దాలుగా నరసరావుపేటలో టీడీపీ డల్..! గతంలోనే ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఏపీ సర్కారు…
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్.. అందరూ హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడికి విహార యాత్రకు వస్తున్నారంటూ మండిపడ్డారు.. ప్రజలు వీళ్లను రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా భావిస్తున్నారని కామెంట్ చేసిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ ఓట్లు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు.. సీఎం వైఎస్ జగన్ ఓటు మాత్రం పులివెందులలో ఉందని గుర్తుచేశారు. ఇక, బద్వేల్ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందని సెటైర్లు వేశారు.. ఈ పాదయాత్ర…
రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపి నందిగం సురేష్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంతో రఘురామ కృష్ణంరాజు కుమ్మక్కై.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని.. అతని భాష వింటే ఎంపి అని చెప్పటం కూడా సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాజద్రోహానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎందుకు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని నిప్పులు చెరిగారు.రఘురామ వెనుక కథ, కర్మ, కర్త, క్రియ అంతా చంద్రబాబే అని.. తానే ఇదంతా చేయించిన విషయాన్ని రఘురామ కృష్ణంరాజు బయటపెట్టేస్తాడేమో అన్న భయం…