మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న బాలశౌరి జనసేనలో చేరడం శుభ సూచకం అని అన్నారు. ఒక ఎంపీగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని తపన పడ్డారని.. కేంద్ర నిధులు వచ్చేలా ఈ రాష్ట్రానికి మంచి జరిగేలా ఎంపీ బాలశౌరి వ్యవహరిస్తారని తెలిపారు.…
జనసేన పార్టీలో చేరుతున్నానని ఎంపీ బాలశౌరి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. మీటింగ్ అనంతరం బాలశౌరి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ తో రెండు గంటలు సమావేశం అయినట్లు తెలిపారు. మంచి ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ అని అన్నారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేయాలి అనే ఆలోచన పవన్ కల్యాణ్ కు ఉందని ఎంపీ తెలిపారు.
ఏపీలో టీడీపీ మాటెత్తితే అంతెత్తున లేస్తారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని). చంద్రబాబుని, లోకేష్ ని, టీడీపీ నేతల్ని ఉతికి ఆరేస్తుంటారు. అలాంటిది ఈసారి నానిగారి టార్గెట్ మారింది. బీజేపీ నేతలపై ఆయనన విమర్శలు చేస్తున్నారు. గుడివాడకు కేంద్రం పలు ఫ్లై ఓవర్లను ప్రకటించిందని, అయితే వాటిని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అడ్డుకుంటున్నారంటూ నాని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో పురందేశ్వరి జాతీయ ప్రధాన…
కృష్ణాజిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా వుంటాయి. అందునా అధికార పార్టీ వైసీపీలో అయితే ఎంపీ, మాజీ మంత్రి మధ్య ఏర్పడిన పంచాయతీ ఎట్టకేలకు అధిష్టానం దృష్టికి చేరింది. ఒకవైపు ఎంపీ బాలశౌరిని అడ్డుకుంది పేర్ని నాని వర్గం. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని ఆగడాలను మీడియాకు ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేసింది బాలశౌరి వర్గం. దీంతో రాజకీయం హాట్ హాట్ గా మారింది. రచ్చ రోడ్డెక్కటంతో రంగంలోకి దిగింది వైసీపీ అధిష్టానం. మీడియా…