రాబోయే ఆర్థిక సంవత్సరంతో ఫ్రెషర్లకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక ఏడాదిలో దాదాపు 150,000 ఉద్యోగ నియామకాలు చేపడతారని అంచనా. ఈ ఉద్యోగాల సంఖ్య గత సంవత్సరం కంటే దాదాపు రెట్టింపు. టీమ్‌లీజ్ డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85,000 నుంచి 95,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాలలో కంపెనీలు తమ శ్రామిక…
Morgan Stanley Layoff: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలతో పాటు అన్ని మల్టీనేషనల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ చేరేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ కూడా తన ఉద్యోగులను తొలగించే ప్లాన్ లో ఉంది.
Startups Fundraising: సొంతగా వ్యాపారం చేయాలనే ఆలోచనలైతే దండిగా ఉన్నాయి కానీ.. అవి ఆచరణలోకి రావటానికి ఆర్థికంగా అండగా నిలిచేవారు కనిపించట్లేదు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు మరియు వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టేందుకు ధైర్యంగా ముందుక రాలేకపోతున్నారు. దీంతో.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. గత నెల ఫిబ్రవరిలో స్టార్టప్‌ల ఫండ్‌రైజింగ్ 8 నెలల కనిష్టానికి పడిపోయింది. ఏడాది కిందటితో పోల్చితే ఏకంగా 83 శాతం తగ్గిపోయింది.
India Set To Become World’s Third-Largest Economy By 2030: ప్రపంచదేశాలు అన్నీ ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటే ఒక్క భారతదేశం మాత్రమే మాంద్యాన్ని తప్పించుకుంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలే బ్రిటన్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలిచింది. ఇదిలా ఉంటే 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తుందని ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ ఓ…