ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కలవరపెడుతోంది మంకీపాక్స్ వ్యాధి. ఇప్పటికే 58 దేశాల్లో 6000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా యూకే, స్పెయిన్, జర్మనీ, ప్రాన్స్ వంటి యూరోపియన్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 85 శాతం కేసులు ఒక్క యూరోప్ ఖండంలోనే నమోదు అయ్యాయి. తాజాగా ఇండియాలో మంకీపాక్స్ కేసుల నమోదు అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్ కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన విద్యార్థికి మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు…
ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని 51 దేశాల్లో 5 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే యూరప్ లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యూరప్ లో గత రెండు వారాల్లో కేసుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మంకీపాక్స్ కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ యూరప్ దేశాలకు సూచించింది. ప్రపంచంలో నమోదైన కేసుల్లో…
కరోనా తర్వాత ప్రపంచాన్ని భయపెడుతోన్న మరో వైరస్ మంకీపాక్స్. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. మంకీపాక్స్ మరిన్ని దేశాలకు విస్తరించడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. అసలు మంకీపాక్స్ అంటే ఏంటి?, దాని నివారణ చర్యలు తదితర అంశాలపై ముందుగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కానీ మంకీపాక్స్ వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించాలా వద్దా అనే…
కరోనా వైరస్ పీడ పోకముందే మరోవైరస్ కలకలం రేపుతోంది. పలుదేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తిపై తాజాగా నిపుణులు పలు పరిశోధనలు చేపట్టారు. అది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని, కానీ సోకిన వ్యక్తితో నిరంతరం సన్నిహితంగా ఉంటే వ్యాపిస్తుందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. వైరస్ సోకిన వారితో శారీరక సంబంధం ద్వారా.. వారి దుస్తులు, వారు దుప్పట్లు తాకడం ద్వారా మంకీపాక్స్…
మంకీపాక్స్ వైరస్ కలకలంరేపుతోంది. ఇప్పటికే దాదాపు 50కి పైగా దేశాలకు విస్తరించింది. సుమారు 700 కిపైగా కేసులు బయట పడ్డాయి. మంకీపాక్స్ పేరు వినగా ప్రజలంతా జంకిపోతున్నారు. ఇక ఈవైరస్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. ఈ యూరోపియన్ దేశంలో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో వెలుగు చూసింది.…
ప్రపంచాన్ని ప్రస్తుతం మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేవలం సెంట్రల్ ఆఫ్రికా దేశాలకే పరిమితం అయిన మంకీపాక్స్ ప్రస్తుతం యూరప్, అమెరికా దేశాలకు పాకింది. బ్రిటన్ లో మొదటిసారిగా ఈ ఏడాది మే మొదటి వారంలో తొలికేసు నమోదు అయింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ వ్యాధిని కనుక్కున్నారు. ఆ తరువాత నుంచి పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో మే 18న తొలి కేసు నమోదు…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. తాజాగా మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మే మొదటి వారంలో బ్రిటన్ లో బయటపడిన ఈ వైరస్ నెమ్మదిగా యూరప్ దేశాలతో పాటు అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా అమెరికాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇన్నాళ్లు యూరప్ ప్రాంతానికే పరిమితం అయిన మంకీపాక్స్ వైరస్ కేసులు అమెరికాలో కూడా పెరుగుతున్నాయి. మే 18న అమెరికాలో తొలికేసును గుర్తించారు. ప్రస్తుతం యూఎస్ఏలో ఏడు…
ప్రస్తుతం ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే 11 దేశాల్లో 80 కేసులు గుర్తించగా… మరో 50 కేసులు పరిశీలనలో ఉన్నాయి. ఇటీవల మే మొదటివారంలో బ్రిటన్ లో ఓ వ్యక్తిలో వైరస్ కనుకున్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ ను కనుక్కున్నారు. తాజాగా మే 18న యూఎస్ఏలో కూడా ఒక కేసు బయటపడింది. దీంతో ప్రపంచ ఆరోగ్య కేంద్రం ( డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఇప్పటికే యూకే, యూఏస్ఏ, పోర్చుగల్,…