ఓవైపు కరోనా మహమ్మారి భయం వెంటాడుతూనే ఉండగా.. ఇప్పుడు మంకీపాక్స్ కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. రోజురోజుకు మంకీపాక్స్ కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 16వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో.. మంకీపాక్స్‌కు వ్యాక్సిన్‌తో చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధం అవుతోంది.. మంకీపాక్స్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఫార్మా…
ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్ ఇప్పుడు దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. ఆ వ్యక్తి ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలిసింది. 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో, అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌కు…
అమెరికాలో కరోనా వైరస్‌తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న రెండు వైరస్‌లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం తొలిసారి అని అగ్రరాజ్యం అధికారులు తెలిపారు.
Monkeypox Declared A Global Health Emergency By WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ వ్యాధిని అసాధారణ సంఘటనగా పరిగణించింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో పాటు వివిధ దేశాలకు విస్తరిస్తుండటంతో మంకీపాక్స్ ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలా..? వద్దా..?…
monkeypox-New England Journal of Medicine study: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో మూడు కేసులు నమోదు అయ్యాాయి. కేరళలో ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురు మంకీపాక్స్ బారిన పడ్డారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 71 దేశాల్లో 15,400 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మంకీపాక్స్ విస్తరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) రెండోసారి సమావేశం నిర్వహించింది. తాజాగా ఓ అధ్యయనం మంకీపాక్స్ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
third monkeypox confirmed in kerala: ప్రపంచాన్ని మంకీపాక్స్ వ్యాధి వణికిస్తోంది. ఇప్పటికే 70 పైగా దేశాల్లో 14 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఇటీవల భారత్ లో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చింది. తాజాగా దేశంలో మూడో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు కాగా.. మూడో కేసు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదు అయింది. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 35…
ప్రపంచంలోని పలు దేశాల్లో మంకీపాక్స్ ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో 14 వేల మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ బుధవారం చెప్పారు.
With India reporting its first monkeypox case in Kerala on Thursday and the global outbreak of the disease continues, here's everything you need to know about the virus.
ఇన్నాళ్లు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాజాగా ఇండియాలో తొలిసారిగా మంకీపాక్స్ కేసు నమోదు అయింది. కేరళ తిరువనంతపురానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఇటీవల యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చాడు. అయితే అతనికి మంకీపాక్స్ సంబంధిత లక్షణాలు ఉండటంతో శాంపిళ్లను పూణెలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించగా.. మంకీపాక్స్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. తాజాగా మంకీపాక్స్ పై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ…
ఇండియాలో మరోసారి మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదు అయింది. ఇటీవల బ్రిటన్ నుంచి పశ్చిమ బెంగాల్ కు వచ్చిన మిడ్నాపూర్ వాసికి ఒళ్లంతా దద్దర్లతో కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో చేరడం ఆందోళన పెంచింది. అయితే తాజాగా మరో అనుమానిత కేసు కేరళలో నమోదు అయింది. గతంలో కూడా నిఫా, కరోనా వంటి కేసులు ముందుగా కేరళలోనే బయటపడ్డాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి ఇటీవల కేరళలోకి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు…