కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా మధురగాయకుడు మహ్మద్ రఫీ గానం మురిపించింది. ఆయన గాత్రంలో జాలువారిన వందలాది పాటలు ఈ నాటికీ అభిమానులకు ఆనందం పంచుతూనే ఉండడం విశేషం. మహ్మద్ రఫీ అనగానే తెలుగువారికి యన్టీఆర్ ‘భలేతమ్ముడు’ చిత్రం ముందుగా గుర్తుకు వస్తుంది. నిజానికి ఆ సినిమా కంటే ముందే నటగాయక నిర్మాతదర్శకుడు చిత్తూరు వి.నాగయ్య నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘రామదాసు’లో మహ్మద్ రఫీ పాట పాడారు. అందులో కబీర్ పాత్ర ధారి గుమ్మడికి రఫీ…