ఢిల్లీలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. గత ఆప్ ప్రభుత్వ విధానాలపై అసెంబ్లీలో కాగ్ రిపోర్టులను బీజేపీ బహిర్గతం చేస్తోంది. ఇటీవల మద్యం కుంభకోణానికి సంబంధించిన రిపోర్టును ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బయటపెట్టారు.
Mohalla Clinics: ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కొత్త చిక్కు ఎదురైంది. ఆప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్‌ల పనితీరులో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్‌లలో జరిగి రోగనిర్ధారణ పరీక్షల్లో అవినీతి జరిగిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని కేంద్రం కోరినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.