Off The Record: ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్ర లేచినట్టు… తెగ హడావిడి చేసేస్తున్నారు ఆ మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని సదరు నేత.. ఇప్పుడు మాత్రం పిలవకుండానే పలుకుతూ… ఇక్కడెవరన్నా నన్ను పిలిచారా అంటూ డైరెక్ట్‌గా సీన్‌లోకి వచ్చేస్తున్నారట. ఇంతలోనే అంత మార్పు ఏంటి? ఎవరా లీడర్? పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు పే…ద్ద భరోసా వచ్చిందన్నది నిజమేనా? మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఉన్నట్టుండి యాక్టివ్…
వైసీపీని ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ తన భుజస్కంధాలపై పెట్టుకొని నడిపిస్తున్నాడని జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ ప్రశంసించారు. 2029 ఎన్నికలలో జిల్లాలో మొట్టమొదట గెలిచేది అవినాషే అని పేర్కొన్నారు. కడియాల బుచ్చిబాబు తూర్పు నియోజకవర్గానికి కాదు, పార్టీకి కొండంత అండ అని చెప్పారు. వైఎస్ జగన్ ఓడిపోయిన తరువాత ప్రజలకు ఆయన విలువ తెలిసిందని మోదుగుల అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో క్యూ కోడ్ ద్వారా…
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం బాధాకరం అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ కష్ట కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అండగా నిలబడ్డారన్నారు. రాజ్యసభ పోయినా పర్లేదు, పార్టీకి సేవ చేయమని తాను కోరుతున్నానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విజయసాయి రెడ్డి శనివారం తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్…
ఒకప్పుటి రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నా.. ఆ వైరం పోదు. కలిసి సాగలేరు. వెళ్దామన్నా ఇగోలు.. పాత గొడవలు అడ్డొస్తాయి. గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య అదే జరుగుతోందట. పరస్పరం పైచెయ్యి సాధించేందుకు వారు వేయని ఎత్తుగడలు లేవంటున్నారు పార్టీ నాయకులు. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కథా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్‌గానే ఉంటాయి. జిల్లాలోని కీలక నేతలంతా నివాసం ఉండేది ఇక్కడే. అందుకే…