ప్రధాని విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 29 నుంచి నవంబరు 2 వరకు ఇటలీ, బ్రిటన్లలో పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు.. ఇటలీలోని రోమ్లో అక్టోబరు 30-31 తేదీల్లో జరగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జీ-20 సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇటలీ పర్యటన తర్వాత మోడీ.. గ్లాస్గౌలో జరిగే కాప్-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్కు వెళ్లనున్నారు.…