రేపు హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం జరగనుంది. హైదరాబాద్ తో పాటు మొహాలీ క్యాంపస్ లకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొంటున్నారు. అంతర్జాతీయంగా మేనేజ్ మెంట్ శిక్షణ అందించే అత్యున్నత స్థాయి బిజినెస్ స్కూల్. దీంతో హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) హైదరాబాదులోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాలగా పేరు పొందింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థినీ, విద్యార్ధులకు అంతర్జాతీయ సంస్థల్లో అత్యుత్తమ ప్యాకేజీలతో ఉన్నతోద్యోగాలు లభిస్తున్నాయి. ఇక్కడ పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో మేనేజిమెంటు కోర్సు (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ – ఎంబీఏ) తో పాటు పోస్టు-డాక్టోరల్ ప్రోగ్రాములు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ల కొరకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములను అందిస్తోంది.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కొంతమంది ఫార్ట్యూన్ 500 వ్యాపారవేత్తలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సహకారముతో 1999 డిసెంబరు 20న స్థాపించారు. మెకిన్సీ అండ్ కంపెనీ వరల్డ్‌వైడ్ సంస్థ యొక్క మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రజత్ గుప్తా, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సంస్థ యొక్క స్థాపనలో కీలకపాత్ర పోషించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్ , కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనిజిమెంట్‌లతో భాగస్వామ్య సంబంధాలు ఉన్నాయి. ఏడాది పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు ఐఎస్‌బీ ప్రత్యేకతగా చెప్పాలి.
1996 సంవత్సరంలో కొంతమంది పారిశ్రమక వేత్తలు, విద్యావేత్తలు ఆసియాలో ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి, ప్రత్యేక వ్యాపార కళాశాల స్థాపన ఆవశ్యకతను గుర్తించారు. శరవేగంగా విస్తరిస్తున్న పరిశ్రమలకు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ సూక్ష్మ నైపుణ్యాలలో శిక్షణ పొందిన యువ నాయకులు, పారిశ్రామిక వేత్తల అవసరమని వారు గుర్తించారు. రొటీన్ కి భిన్నంగా వినూత్న విద్యా కార్యక్రమాలతో, ప్రపంచ స్థాయిలో సమానమైన వ్యాపార కళాశాల స్థాపన జరగాలని వ్యవస్థాపకులు భావించారు. అనుకున్నదే తడవుగా ఆ ఆలోచన కార్యరూపం దాల్చింది. వార్టన్ స్కూల్, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్‌లతో కలిసి అంతర్జాతీయ అకడమిక్ కమిటీ ఏర్పడింది. కొంతకాలం తర్వాత లండన్ బిజినెస్ స్కూల్ కూడా ఈ బోర్డులో భాగస్వామ్యం అయింది. మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం 2001లో 128 మంది విద్యార్థులతో ప్రారంభించబడింది, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.భారతదేశం లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాపార కళాశాలను తమ రాష్ట్రాలలో( మహారాష్ట్ర,కర్ణాటక ప్రభుత్వాలు ) ప్రారంభించాలని వ్యాపారవేత్తలను కోరారు. అన్ని వసతులను పరిశీలించిన వ్యాపారవేత్తల బృందం అన్ని పరిశీలించి , చివరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో స్థాపనకు స్వాగతించి, సరైన వసతులు కల్పించడంతో ఎట్టకేలకు 1999 సంవత్సరంలో క్యాంపస్ భవనాలకు శంకుస్థాపన చేశారు. 2001 డిసెంబర్ 2న అప్పటి ప్రధాని వాజ్ పేయి చేతులమీదుగా ఐఎస్ బీ ప్రారంభమయింది. అనంతరం 2010 ఆగస్టులో మొహాలీ క్యాంపస్ నిర్మాణానికి బీజం పడింది.
తొలుత 128మంది విద్యార్ధులతో ప్రారంభమయింది. ఇప్పటివరకూ 14,500 మంది విద్యార్ధులు వివిధ కోర్సులు అభ్యసించారు. 11 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు ఇక్కడ వున్నాయి. ఐఎస్ బీలో కోర్సు పూర్తయితే అత్యధిక ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తాయి. పీజీపీఎం పూర్తయితే సగటున ఏడాదికి 32 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. భారత్ లో తొలిస్థానం, ఆసియా బిజినెస్ స్కూళ్ళలో నాలుగవ స్థానం ISB స్వంతం. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు రెండు క్యాంపస్ లు ఉన్నాయి, హైదరాబాద్ లో 260 ఎకరాల స్థలంలో, పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో 70 ఎకరాల స్థలంలో ఇవి ఏర్పాటయ్యాయి. ఇక్కడ చేరిన విద్యార్థులకు క్యాంపస్ వసతి ఉంది. అత్యుత్తమ బోధన లభిస్తుంది.
ప్రవేశం పొందడం ఎలా?
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్( ఐఎస్ బి) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ (పిజిపి) ప్రపంచవ్యాప్తంగా టాప్ ర్యాంక్ కలిగిన ఒక సంవత్సరం మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్. ప్రపంచంలోని అత్యుత్తమ బి-స్కూల్స్ లో పరిగణించబడే ఐఎస్ బి యువ మేనేజర్లకు క్రమశిక్షణా దృక్పథాలు, ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక రంగాలలో జరుగుతున్న మార్పులలో వారికీ అత్యాధునిక పరిశోధనతో, ప్రపంచంలోని అత్యుత్తమ అధ్యాపకులు బోధించే విస్తృతంగా ప్రశంసలు పొందిన పాఠ్యప్రణాళికతో వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం రూపొందించారు.
ప్రవేశ అర్హతలు
జీమ్యాట్ (GMAT) లేదా జిజిఎ (GGA) స్కోరుఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.
గ్రాడ్యుయేషన్ తరువాత కనీసం 24 నెలల పూర్తికాల పని అనుభవం.
24 నెలల కంటే తక్కువ పని అనుభవం ఉన్న అభ్యర్థులు ఇంకా రెండు ఇతర ప్రవేశ విధానాల ద్వారా పిజిపికి దరఖాస్తు చేసుకోవచ్చు. యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ (వైఎల్ పి) – దీనిలో ప్రవేశమునకు హై-కాలిబర్ ఫైనల్,ప్రీ-ఫైనల్ ఇయర్ కాలేజీ విద్యార్థుల కోసం ఎర్లీ ఎంట్రీ ఆప్షన్ (ఈఈఓ)- 2 సంవత్సరాల కంటే తక్కువ పని అనుభవం ఉన్న అభ్యర్థులు దీని ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చును.
గుర్తింపు
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (హైదరాబాద్, మొహాలీ), అధికారికంగా ఎంబిఎల సంస్థ (అంబాఎ) నుండి అక్రిడిటేషన్ పొందింది, దీనితో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంబాఎ, ఈక్యూఎస్, అసోసియేషన్ టు అడ్వాన్స్ కాలేజియేట్ స్కూల్స్ ఆఫ్ బిజినెస్ (ఎఎసిఎస్ బి) నుండి అక్రిడిటేషన్ల ‘ట్రిపుల్ క్రౌన్’ సాధించిన ప్రపంచంలోని 100వ కళాశాలగా నిలిచింది. ట్రిపుల్ అక్రిడిటేషన్, దీనిని ‘ట్రిపుల్ క్రౌన్’ అక్రిడిటేషన్ అని కూడా అంటారు, ఇది ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బిజినెస్ స్కూల్స్ (ప్రపంచంలోని అన్ని స్కూళ్లలో 1శాతం కంటే తక్కువ) కలిగి ఉన్న అక్రిడిటేషన్ ల కలయిక, ఇది మూడు అతిపెద్ద , అత్యంత ప్రభావవంతమైన అక్రిడిటేషన్ సంస్థలచే ప్రదానం చేస్తారు.