Komatireddy Venkat Reddy : ‘అమృత్ భారత్’ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన 103 రైల్వే స్టేషన్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సూళ్లూరు పేట స్టేషన్‌లు ఉన్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖులు…