MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే, సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.