మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ లైన్ ఎవరు దాటిన వారి పైనా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం కామన్ అన్నారు. నాకైనా, చిన్నారెడ్డి కైనా, రేవంత్ రెడ్డికి అయినా ఒకే చర్యలు ఉండాలి అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలనుకున్న వారిలో మల్లన్న ఒకరు అని మధుయాష్కీ పేర్కొన్నారు.