ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుకు సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరినీ గోవా క్యాంప్ కు తరలించారు. గత వారం రోజులుగా 470 మంది ఓటర్లు వారితోపాటు వారి బంధువులు అంతా గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. గోవాలో డ్యాన్సులతో మారుమోగుతున్న వీడియోలను ఎప్పటికప్పుడు ఎన్టీవీ అందించింది. అయితే ఈ నెల పదో తారీఖున ఓటింగ్ ఉండటంతో అక్కడ ఉన్న ఓటర్లను ముందుగా హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ప్రస్తుతతం గోవాలో ఉన్న ఓటర్లు…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంప్ రాజకీయాలకు తెరలేపుతున్నారు రాజకీయ నేతలు.. తెలంగాణ కొన్ని స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడిపోగా.. మిగతా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడంతో.. పోటీ అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో తమ ప్రజాప్రతినిధులు చేజారకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు.. అందులో భాగంగా ఆదిలాబాద్‌లో అధికార పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను క్యాంప్‌కు తరలించేందుకు సిద్ధం అయ్యింది……
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది… వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది మినహా అందరూ నామినేషన్లు ఉపసహరించుకోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.. దీంతో వరంగల్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ మరో సారి నిలబెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ ఈ కోటాలో మండలి స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వేసిన ఎత్తుగడలు…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఏర్పడింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పరిశీలన, ఉపసంహరణ మిగిలింది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను టీఆర్‌ఎస్ మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ…
తెలంగాణలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడులైన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంల నేడు నామినేషన్లకు చివరి రోజు. ఇప్పటికే టీఆర్‌ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. కానీ కాంగ్రెస్ దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా..? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ మేరకు…
తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ కోటా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కేసీఆర్ కూతురు కవితను మరోసారి ఎమ్మెల్సీగా ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత పదవీకాలం జనవరి 4న ముగియనుంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆ రాజ్యసభ ఆ స్థానంలో రాజ్యసభకు కవితను వెళ్లబోతుందంటూ ప్రచారం…
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే…
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు తేలడంతో.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఓసీ సామాజికవర్గానికి ఎక్కువ ఎమ్మెల్సీలు దక్కడంతో.. స్థానిక కోటాలో బీసీ లెక్కలు తెరపైకి వస్తున్నాయి. 12 మంది సిట్టింగ్‌లలో సగానికి సగం మంది అభ్యర్థులను మార్చే ఛాన్స్ కనిపిస్తోంది. రెండేళ్లే పదవిలో ఉన్నవారిలో ముగ్గురికి రెన్యువల్..? తెలంగాణలో పదవీకాలం ముగిసే 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో టీఆర్‌ఎస్‌లో రాజకీయ వేడి…
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామా? వద్దా..? అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది… లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంపై ఇవాళ పీఏసీ సమావేశమై చర్చింది.. అయితే, పోటీపై ఎలాంటి నిర్ణయానికి రానట్టుగా తెలుస్తోంది.. ఇక, నల్గొండలో పోటీ చేయాలా..? వద్దా..? అనేది జిల్లా నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అని ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి తెలిపినట్టుగా సమాచారం.. మరోవైపు..…
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది గులాబీ పార్టీ.. అయితే.. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభ మొదట ఈ నెల 15న నిర్వహించాలనుకున్నా.. కొన్ని కారణాలతో దానిని 29వ తేదీకి వాయిదా వేశారు.. తెలంగాణ దీక్షాదివస్ అయిన ఈ నెల 29వ తేదీన సభను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయితే, మరోసారి ఈ…