వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా నడుస్తుంది. గత రెండు రోజులుగా దువ్వాడ సతీమని వాణి, ఆమె కుమార్తెలు తమ తండ్రి, ఎమ్మెల్సీ దువ్వాడ తీరును తప్పు బడుతు రచ్చకెక్కారు. దీంతో శ్రీనివాస్ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డున పడింది. టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంటున్న ఆయన ఇల్లు , కార్యాలయం వద్దకు కుమార్తెలు రావడం ఆయన తలుపులు తీయకపోవడంతో విషయం రచ్చకెక్కింది.