ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార టీఆర్ఎస్‌లో వర్గపోరు పీక్స్‌కు చేరుకుంటోంది. ఎన్నికల వాతావరణం క్రమంగా రాజుకుని.. అందులో వర్గపోరు సెగలు రేపుతోంది. సమయం చిక్కితే చాలు అధిపత్యపోరు రకరకాల మలుపులు తిరుగుతోంది. చివరకు మేడే వేడుకలు, ఇఫ్తార్ విందుల్లోనూ తన్నుకునే వరకు వెళ్తున్నారు పార్టీ నేతలు.. వారి అనుచర వర్గాలు. నకిరేకల్‌లో ఎవరు ఎగ్జిట్ అవుతారు?నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని పరిణామాలు ఎప్పటికప్పుడు చర్చల్లో ఉంటున్నాయి. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య మూడేళ్లుగా…