మెదక్ జిల్లాలోని గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సునీతా ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు గుండా రాజ్యం నడుస్తుందన్నారు. మొన్న సిద్దిపేటలో నా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగిందని, నిన్న కౌశిక్ రెడ్డిపై, అర్థరాత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి జరిగిందని హరీష్ రావు మండిపడ్డారు. బీహార్, రాయలసీమ ఫ్యాక్షన్…